నెల్లూరు బీజేపీ ఎంపీగా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి

భారతీయ జనతాపార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి పేరు ఖరారైంది. ఈమేరకు గురువారం ఆ పార్టీ తరపున రాష్ట్రంలో పోటీ చేసే ఎంపీ అభ్యర్ధుల పేర్లను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం నెల్లూరు పార్లమెంట్‌ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి పోటీ చేయనున్నారు. నెల్లూరు పార్లమెంట భాజపా అభ్యర్థిగా ఈనెల 25వ తేదీన నామినేషన్‌ వేయనున్నట్లు సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి గురువారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు.

  • పేరు : సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి
  • పుట్టిన తేది : 10-07-1962
  • విద్యార్హతలు : బీఏ., ఎంఈఎస్‌
  • వృత్తి : వ్యవసాయం, సోషల్‌ వర్కర్
  • సతీమణి : సుధారాణి

రాజకీయ ప్రస్థానం :

1976-1982 ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వయం సేవక్‌గా పనిచేశారు. 1982-84 వరకు జిల్లా ప్రముఖ్‌గా ఉంటూ ఏబీవీపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పుల్‌టైం వర్కర్‌గా పనిచేశారు. 1984-85 వరకు కిసాన్‌ సంఘ్‌ సహాయ కార్యదర్శిగా పనిచేస్తూ భాజపాలో బాధ్యతలు చేపట్టారు. 1985-87 వరకు భాజపా జిల్లా కార్యదర్శిగా పనిచేశారు. అప్పటి నుంచి భాజపా జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఇతర జిల్లాల పార్టీ ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. 2014 నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2004లో నెల్లూరు నగరం నుంచి, 2014లో నెల్లూరు గ్రామీణం నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేశారు.