షరపోవా అనుహ్య ఓటమి

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో సంచలన జరిగింది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్ ప్రీక్వార్టర్స్‌లో దిగ్గజ క్రీడాకారిణి మరియా షరపోవా అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. షరపోవాపై 4-6, 6-1, 6-4 తేడాతో నయాసంచలనం ఆష్‌బార్టీ సంచలన విజయం నమోదు చేశారు. ఆదివారం ఇక్కడి మెల్‌బోర్న్ పార్క్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆష్‌బార్టీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో గ్రాండ్‌స్లామ్‌లో తొలిసారి ఆష్‌బార్టీ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరారు.

ఈ దశాబ్దాంలో తొలిసారి అస్ట్రేలియన్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన తొలి ఆస్ట్రేలియన్‌ ప్లేయర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. 22 ఏళ్ల ఆష్‌బార్టీ 5సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేత అయిన షరపోవాను ఓడించడం విశేషం.