వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన సింధు

గంటా 12 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో ఫస్ట్‌ గేమ్‌ నెగ్గినా.. తర్వాత ప్రత్యర్థికి తలవంచింది. తొలి గేమ్‌లో ఒక దశలో 17-20తో సింధు వెనుకబడినా.. వరుసగా 5 పాయింట్లతో గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. కానీ, రెండో గేమ్‌లో సింధుకు ఏమాత్రం అవకాశం ఇవ్వని యుఫీ 21-16తో నెగ్గి మ్యాచ్‌ ఫలితాన్ని ఆఖరి గేమ్‌కు తీసుకెళ్లింది. ఇక నిర్ణాయక మూడో గేమ్‌లో ఓదశలో సింధు 4-8తో వెనుకబడినా.. చక్కటి పోరాటం కనబరిచి 10-10తో స్కోరును సమం చేసి పోటీలోకొచ్చింది.ఈ దశలో వైడ్‌ షాట్లతో యుఫీ విజృంభించడంతో భారత షట్లర్‌ ఇబ్బంది పడింది. 12-12తో ఇరువురూ సమంగా ఉన్న దశలో యుఫీ వరుసగా 9 పాయింట్లతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సైతం సొంతం చేసుకుంది. దీంతో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడడంతో టోర్నీలో సింధు నాకౌట్‌ అవకాశాలు గల్లంతయ్యాయి