తన తల్లిని గెలిపించాలంటూ ఓటర్లను కోరిన సోనాక్షి సిన్హా

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా అభ్యర్ధులకు మద్దతుగా కొంత మంది సెలబ్రెటీలు ప్రచారం చేస్తారు. ఆ సెలబ్రెటీలు కుటుంబసభ్యులైతే ఇంక ఆ ఆనందానికి అవధులుండవ్‌. బాలీవుడ్‌ నటి, శతృఘ్నసిన్హా తనయ సోనాక్షి సిన్హా కూడా తన తల్లి గెలుపు కోసం ప్రచారం మొదలుపెట్టింది.

ఆమె తల్లి పూనమ్‌ సిన్హా సమాజ్‌వాదీ పార్టీ తరఫున లక్నో నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాజ్‌నాథ్‌ సింగ్‌కు పోటీగా బరిలోకి దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపి రాజధానిలో నిర్వహించిన రోడ్‌షోలో పూనమ్‌తో పాటు సోనాక్షి కూడా పాల్గొన్నారు. తన తల్లిని గెలిపించాలంటూ అక్కడున్న ఓటర్లను అభ్యర్ధించారు. ఈ ప్రచారంలో అఖిలేష్‌ యాదవ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ కూడా పాల్గొన్నారు.