మిస్ యూనివెర్సెగా దక్షిణాఫ్రికా సుందరి

ఈ ఏడాది విశ్వసుందరిగా దక్షిణాఫ్రికాకు చెందిన జోజిబినీ తుంజీ(26) ఎన్నికయ్యారు. మొత్తం తొంభై మంది అందాల భామలు పాల్గొన్న ఈ పోటీలో మిస్‌ దక్షిణాఫ్రికా తుంజీ విశ్వసుందరి కిరీటం పొందారు. అమెరికాలోని అట్లాంటాలోని టైలర్‌ పెర్రీ స్టూడియోస్‌లో జరిగిన ఈ అందాల పోటీలకు పాపులర్‌ టీవీ పర్సనాలిటీ స్టీవ్‌ హార్వే హోస్ట్‌గా నిర్వహించారు. ఇక ఏడుగురు మహిళలతో కూడిన బృందం ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఫైనల్‌లో ప్యూర్టో రికన్‌, మెక్సికన్‌ భామలను వెనక్కి నెట్టి జోజిబినీ తుంజీ విజేతగా నిలిచినట్లు వారు ప్రకటించారు.