హత్యకు గురయిన ఎస్పి నాయకుడు రాకేష్‌ యాదవ్‌

సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పి) నాయకుడు రాకేష్‌ యాదవ్‌ మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. పనులను ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అతనిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. దీంతో రాకేష్‌ యాదవ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

పోలీసులు రాకేష్‌ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆస్తి వివాదాల నేపథ్యంలోనే రాకేష్‌ను హత్య చేసి ఉండోచ్చని పోలీసులు భావిస్తున్నారు. బరోలి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జిగా వ్యవహరిస్తున్న రాకేష్‌ యాదవ్‌..ప్రాపర్టీ డీలర్‌గా కూడా పనిచేస్తున్నారు. రాకేష్‌ హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.