ఆన్‌లైన్ లో కోచింగ్ ఇవ్వనున్న వీవీఎస్ లక్ష్మణ్

కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ను క్రికెటర్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ ఆన్‌లైన్‌లో కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం ఆయన బెంగాల్ రంజీ టీమ్‌కు బ్యాటింగ్ సలహాదారునిగా కొనసాగుతున్న వీవీఎస్, ఆన్‌లైన్‌లో కూడా శిక్షణ ఇస్తున్నాడు.

ఈ మధ్యే ముగిసిన రంజీ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన బెంగాల్ జట్టు, బ్యాట్స్‌మెన్ లోపాలను వీవీఎస్ చక్కదిద్దబోతున్నాడు. సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో బెంగాల్ బ్యాటింగ్ ఇబ్బందులతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ‘ నేను ఈ రోజు వీవీఎస్‌తో మాట్లాడాను. గత రంజీ సీజన్‌కు సంబంధించిన వీడియోలను అనలిస్ట్ ద్వారా వీవీఎస్‌తో షేర్ చేసుకుంటాం. కొన్ని రోజుల్లో ప్రతి ఒక్క బ్యాట్స్‌మెన్‌తో కలిసి విడివిడిగా ఆన్‌లైన్ సెషన్స్ ఉంటాయి. ముఖ్యంగా టాపార్డర్ ఆటగాళ్లపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాం. రానున్న సీజన్‌కు పూర్తి స్థాయిలో సిద్దం చేసేందుకు ఈ క్లాస్లు ఉపయోగపడుతాయి ’ అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ అవిషేక్ దాల్మియా అన్నాడు.