స్టార్‌ వార్స్‌ చ్యూబాక్కా మృతి

స్టార్‌ వార్స్‌ చిత్రాలలో చ్యూబాక్కా పాత్ర పోషించిన పీటర్‌ మెహ్యూ(74) ఇకలేరు. ఏప్రిల్‌ 30న టెక్సాస్‌లోని తన నివాసంలోనే కన్నుమూశారు.

చ్యూబాక్కా పాత్రతో ప్రతి ఓక్కరినీ అలరించిన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లడం ఎంతో బాధగా ఉందని కుటుంబ సభ్యులు వాపోయారు. అసలు చ్యూబాక్కా పాత్రకి పీటర్‌ ఎంపిక ఎలా జరిగిందంటే స్టార్‌ వార్‌ క్రియేటర్‌ జార్జ్‌ లుకాస్‌ పొడగాటి వ్యక్తిని కావాలని కోరాడు. దీంతో ఏడడుగుల రెండు ఇంచులు ఉన్న మెహ్యూకి దక్కింది. ఐతే ఈ సినిమాలో ఆయన ఫేస్‌ ఇప్పటి వరకు కనిపించలేదు. పీటర్‌కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.