భరత్ జట్టు పై మండి పడిన మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్

ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న భారత్‌ జట్టుపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం రాత్రి ముగిసిన సిరీస్ విజేత నిర్ణయత్మక ఆఖరి వన్డేలో బౌలింగ్, బ్యాటింగ్‌లో తడబడిన టీమిండియా 35 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. దీంతో.. ఐదు వన్డేల సిరీస్‌ను 3-2తో కంగారులు చేజిక్కించుకోగా.. సిరీస్ గెలవకముందే కోహ్లీసేన ప్రయోగాల వెంట పరుగెత్తడాన్ని గవాస్కర్ తప్పుబట్టాడు.