జగన్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యుడు గద్దె రామ్మోహన్ నిరసన తెలిపారు

పింఛన్ల తీసివేతపై టీడీపీ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు ఆయన ఆధ్వర్యంలో విజయవాడలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, పింఛన్ రద్దు అయిన మహిళలు, వృద్దులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. సీఎం జగన్.. పాలనను పక్కనబెట్టి ప్రజలపై కక్ష సాదిస్తుతున్నారని ఆయన తెలిపారు.

వృద్దులు, వికలాంగులు, వితంతు పెన్షన్లు తొలగించడం ఏంటని ప్రశ్నించారు. పెన్షన్ లేకపోతే వృద్దులు, వికలాంగులు ఎలా బతకాలని గద్దె రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వీరు ఆత్మస్థైర్యంతో జీవించాలని 200 ఉన్న పెన్షన్‌ను టీడీపీ 2000 వేలకు పెంచిందన్నారు. జగన్‌కి వైసీపీ వారు తప్ప రాష్ట్రంలో ఎవ్వరూ కనిపించడం లేదన్నారు. జగన్‌కి పిచ్చి ముదిరి పాకానపడుతోందన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే.. ప్రజలే తగిన గుణపాఠం చెపుతారని గద్దె రామ్మోహన్ తెలిపారు.