బ్రెంటన్‌ టారెంట్‌పై ఉగ్రవాదం కేసు నమోదు

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో మసీదులపై కాల్పులు జరిపిన బ్రెంటన్‌ టారెంట్‌పై ఉగ్రవాదం కేసు కింద అభియోగం నమోదు చేశారు. బ్రెంటన్‌ జరిపిన కాల్పుల్లో సుమారు 51 మంది మరణించారు. ఉగ్రవాద దాడికి బ్రెంటన్‌ ప్రయత్నించాడని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

హత్య, హత్యాయత్నం కేసులు ఇప్పటికే నమోదయ్యాయి. మార్చి 15న ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్‌..క్రైస్ట్‌చర్చ్‌ మసీదుల్లో కాల్పులకు తెగించిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటన తర్వాతే న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ సెమీ ఆటోమేటిక్‌ ఆయుధాలపై నిషేధం విధించింది.