జార్ఖండ్‌లో బీజేపీ కార్యాలయాన్ని పేల్చివేసిన నక్సల్స్‌

జార్ఖండ్‌లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్‌లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్‌ పేల్చివేయడం కలకలం రేపింది. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జార్ఖండ్‌ మాజీ సీఎం, బీజేపీ అభ్యర్ధి అర్జున్‌ ముందా ఇదే కార్యాలయం నుంచి పనిచేస్తుండటం గమనార్హం. కాగా గురువారం తెల్లవారుజామున బీజేపీ కార్యాలయంలో నక్సల్స్‌ బాంబు దాడులకు పాల్పడ్డారు.

మరోవైపు బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఖుంటి, కొడెర్మా, రాంచీల్లో శుక్రువారం ప్రచార ర్యాలీలు నిర్వహించనున్నారు. నక్సల్స్‌ దాడికి గురైన ఖర్సవన్‌ బీజేపీ కార్యాలయం ఖుంటి లోక్‌సభ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గంలో ఐదో దశలో మే 6న పోలింగ్‌ జరగనుంది.