ఇంకోసారి ఆలోచించమంటున్న సిపిఎం పార్టీ సభ్యుడు పి మధు

రాజధాని మార్పు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు కోరారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించకుండా సచివాలయం, రాజభవన్‌ను అమరావతి నుంచి తరలించడానికి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లును సిపిఎం రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలో మెజారిటీ ఉందనే పేరుతో రాష్ట్రంలో ఉన్న పార్టీలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మొండిగా వ్యవహరించడం గమనార్హం అని తెలిపారు. ప్రతిష్టకు పోకుండా ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించాలని కోరారు.