ఇద్దరమ్మాయిల వీడియోను డిలీట్‌ చేసిన టిక్ టాక్

ఇ‍ద్దరు యువతులు కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశారు. ఆ వీడియోను టిక్‌టాక్‌లో షేర్‌ చేయగా.. అద్భుతంగా వచ్చిందని ప్రశంసలు అందుకుంటున్న సమయంలో టిక్‌టాక్‌ సంస్థ దాన్ని తీసివేసింది. దీంతో సదరు యువతులు టిక్‌టాక్‌ తీరును తప్పుపడుతున్నారు. వీడియోను తొలగించేంత తప్పు ఏం చేశామని టిక్‌టాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే టిక్‌టాక్‌ వీరి వీడియో తొలగించడానికి ప్రధాన కారణం వీరు లెస్బియన్స్‌ కావటమే అని పలువురి అభిప్రాయం. ఇండో పాక్‌కు చెందిన యువతులు అంజలి చక్రా, సుందాస్‌ మాలిక్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా వీడియో డిలీట్ చేసినందుకు టిక్ టాక్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసింది అంజలి .