ఉరుగ్వేయన్‌ మోడల్‌ ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పద మృతి

ఉరుగ్వేయన్‌ అందగత్తె ఫాతిమివ్ డేవిలా అనుమానాస్పదంగా మృతి చెందారు. గురువారం మెక్సికోలోని ఓ హోటల్‌ బాత్‌రూమ్‌లో ఆమె చనిపోయి ఉండటాన్ని హోటల్‌ సిబ్బంది గుర్తించారు. ఉరుగ్వేయన్‌కు చెందిన 31ఏళ్ల ఫాతిమివ్‌ డేవిలా ఆ దేశం తరుపున మిస్‌ యూనివర్స్‌, మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొన్నారు. వృత్తిరీత్యా మోడల్‌ అయిన డేవిలా మెక్సికోలో నివాసముంటోంది. మోడలింగ్‌ విషయమై గత నెల 23న మెక్సికోలోని ఓ హోటల్‌లో ఆమె దిగారు.

మే 2వ తేదీన హోటల్‌ గదిలోని బాత్‌రూమ్‌లో ఆమె చనిపోయి ఉండటాన్ని సిబ్బంది గుర్తించి, పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. ఆమెది ఆత్మహత్యా? లేక హత్యా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.