అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రోజెన్‌స్టీన్‌ రాజీనామా

2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై దర్యాప్తునకు ప్రత్యేక సలహాదారు ముల్లర్‌ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించిన అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్‌ రాడ్‌ రోజెన్‌స్టీన్‌ తాజాగా రాజీనామా బాట పట్టారు.

ముల్లర్‌ నివేదిక వెల్లడి తరువాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మే 11వ తేదీ నుండి అమల్లోకి వచ్చే విధంగా తన రాజీనామా లేఖను అధ్యక్షుడు ట్రంప్‌కు పంపారు. దేశానికి సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించిన ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియచేశారు. అయితే ఆయన తన రాజీనామా లేఖలో ప్రత్యేక సలహాదారు ముల్లర్‌ ప్రస్తావన తీసుకురాలేదు. రోజెన్‌స్టీన్‌ వారసుడిగా ప్రస్తుతం రవాణా విభాగంలో ద్వితీయశ్రేణి ఉన్నతాధికారిగా వున్న జెఫ్రీ రోజెన్‌ బాధ్యతలు స్వీకరించనున్నట్లు తెలుస్తోంది.