పౌరసత్వ బిల్లుపై అస్సాం లో ఆందోళనలు

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా అస్సాంలో ఆందోళనలతో అట్టుడుకిపోతుంది. భద్రతా బలగాల మోహరింపు, ఆందోళనకారుల నిరసనలతో గువాహటిలో వాణిజ్యానికి నెలవైన జీఎస్ రోడ్డు మొత్తం యుద్ధ క్షేత్రాన్ని తలపించింది. కేవలం గువాహటిలోనే కాదు.. దాదాపు బ్రహ్మపుత్ర లోయ మొత్తం క్యాబ్‌కు వ్యతిరేకంగా కదం తొక్కింది. విద్యార్థులు, కార్యకర్తలు, రచయితలు, నటులు, సంగీత విద్వాంసులు సహా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు వీధుల్లోకి వచ్చి క్యాబ్‌పై నిరసనలు తెలిపారు.