2020 ఫిబ్రవరి 1 నుంచి కొన్ని ఫోన్స్లో వాట్సాప్ నిలిపివేయనున్నారు

15 February 2019, Baden-Wuerttemberg, Stuttgart: The logo of the Messenger app WhatsApp can be seen on the display of an iPhone. (to dpa "Teachers in the country often do not adhere to the Whatsapp ban" of 17.02.2019) Photo: Fabian Sommer/dpa (Photo by Fabian Sommer/picture alliance via Getty Images)

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి పలు పాత స్మార్ట్‌ఫోన్లలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌ పనిచేయదు. ఈ విషయాన్ని తన ఎఫ్‌ఏక్యూ సెక్షన్‌లో వాట్సాప్‌ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ 2.3.7, అంతకు ముందు ఉన్న పాత వర్షన్‌లపై నడిచే ఫోన్లు, ఐవోఎస్‌ 8, దానికి ముందరి ఓఎస్‌లపై నడిచే ఐఫోన్లలో వచ్చే ఏడాది నుంచి వాట్సాప్‌ సేవలు లభించవు. ఈ పాత ఫోన్లలో ఫిబ్రవరి 1 తర్వాత వాట్సాప్‌ ఖాతాను క్రియేట్‌ చేసుకోవడం కానీ, ఉన్న ఖాతాను పునరుద్ధరించుకోవడం కానీ కుదరదు. అన్ని రకాల విండోస్‌ ఫోన్లకు కూడా 2019 డిసెంబర్‌ 31 నుంచి తమ సేవలు ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది.