సింగపూర్‌లో భారతీయుడికి ఆరు వారాల జైలు శిక్ష

ముతుకరుప్పన్‌ పెరియసామి(52) అనే ఓ భారతీయుడికి సింగపూర్‌లో ఆరు వారాల జైలు శిక్ష పడింది.

పెరియసామి సింగపూర్‌లో ఫెన్‌జిల్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌, రామో ఇండస్ట్రీస్‌లో కన్‌స్ట్రక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఉద్యోగుల ఆరోగ్య భద్రత రాజీ విషయంలో పెరియసామి 1,600 సింగపూర్ డాలర్లను అధికారులకు లంచంగా ఇవ్వజూపినట్లుగా సమాచారం. కాగా పెస్ట్ కంట్రోల్ కంపెనీకి చెందిన ఇద్దరు అధికారులకు లంచం ఇవ్వజూపిన కేసులో ఇతడికి జైలు శిక్ష పడింది.