అమెరికాలో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులు

అమెరికాలో 3 లక్షల పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ వివిధ విశ్వవిద్యాలయాల్లో తాత్కాలిక ఉద్యోగాలు చేస్తున్న 50వేల మంది ఇప్పుడు నిరుద్యోగులయ్యారు, వీరుకాక మరో లక్షమంది విద్యార్థులు అనధికారికంగా వివిధ వాణిజ్య, వ్యాపారసంస్థల్లో రోజువారీ వేతనంపై పనిచేస్తుంటారు.

ఇలా సంపాదించుకుంటున్న సొమ్ముతోనే అక్కడ తాము చదువుకోవడానికి అవసరమైన సదుపాయాలన్నీ సమకూర్చుకుంటున్నారు. వారిలో పలువురు ఇప్పుడు తాత్కాలిక ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఎంతోకొంత సహాయం చేయాలని NATA కి ఉన్నా లాక్‌డౌన్‌ కారణంగా సాధ్యపడటంలేదు. ఎక్కువ సంఖ్యలో ఉన్న మన విద్యార్థులను భారత్‌కు పంపడం ఇప్పట్లో సాధ్యపడదని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం చెబుతోంది.