అమెరికా హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు

అమెరికాలోని హిందూ దేవాలయాల్లో వరుస చోరీలు అక్కడున్న ప్రవాస తెలుగువారిని కలవర పెడుతున్నాయి. మే 17న కమ్మింగ్‌లో శ్రీ మహాలక్ష్మి ఆలయం, అట్లాంటాలోని రివర్‌డేల్‌లోని ఆలయంలో 18న చోరీలు జరిగాయి. ఈ రెండు దేవాలయాల్లో ఒకే గ్యాంగ్‌ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. పూజారుల కళ్లుగప్పి విగ్రహాలకు అలంకరించిన బంగారు ఆభరణాలను చోరీ చేశారు.

మొత్తం ఆరుగురు ఈ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. వీరిలో ముగ్గురు మహిళలున్నారు. హిందూ మతం ఆచార వ్యవహారాల గురించి పూజారిని అడుగి దృష్టి మరల్చగా, మిగతా వారు చోరీకి పాల్పడినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చోరీకి పాల్పడిన వారిని సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు.